హైదరాబాద్లో మెక్‌డొనాల్డ్స్ భారీ పెట్టుబడులు

హైదరాబాద్లో  మెక్‌డొనాల్డ్స్ భారీ పెట్టుబడులు

హైదరాబాద్ కు విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్ పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది.  అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెన   మెక్ డొనాల్డ్స్  తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో  ఎంవోయూ కుదుర్చుకుంది. 

అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో  మార్చి 19న సీఎం రేవంత్ రెడ్డితో మెక్ డొనాల్డ్స్ సంస్థ ఛైర్మన్ , సీఈవో క్రిస్ కెంజ్జిన్స్కీ తో పాటు సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు తెలంగాణతో ఒప్పందం చేసుకున్నారు. గ్లోబల్ ఇండియా ఆఫీస్ ను హైదరాబాద్ లో 2 వేల మంది ఉద్యోగులతో  ఏర్పాటు చేస్తామని మెక్ డొనాల్డ్ సీఈవో  క్రిస్ కెంజ్జిన్స్కీ  తెలిపారు. 

ALSO READ | అన్నీ ఆడోళ్లకేనా.. మగాళ్లకు 2 మందు బాటిళ్లు ఫ్రీగా ఇవ్వండి : మందు బాబులకు ఆ ఎమ్మెల్యే దేవుడయ్యాడు..!

మెక్ డొనాల్డ్స్  హైదరాబాద్‌ను ఎంపిక చేసినందుకు  సంతోషంగా ఉందన్నారు రేవంత్. గ్లోబల్ సెంటర్ ను తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రావడం గర్వంగా ఉందన్నారు. మెక్ డొనాల్డ్స్ కు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతుల నుంచి సమకూర్చేలా అవకాశం కల్పించాలన సీఎం రేవంత్ కోరారు.