క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ప్రేక్షకులకు ఉచితంగా గుండె పరీక్షలు

ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల్లో జనాలు గుండెపోటుతో మరణిస్తున్నారు. దేశమేదైనా గుండె పోటుతో మరణించేవారు రోజు రోజుకు ఎక్కువైపోతున్నారు. ప్రస్తుత కాలంలో ఈ అకస్మాతు మరణాలు మరీ ఎక్కువ కావడంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్, ఆల్ టైం గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా ఉన్నారు.   

మార్చి 4, 2022న షేన్ వార్న్ గుండెపోటు కారణంగా థాయిలాండ్‌లో  మరణించారు. అప్పటికీ వార్న్ వయసు 52 సంవత్సరాలు. వార్న్ మరణం మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. మైఖేల్ వాన్, నాసర్ హుస్సేన్, రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ లాంటి దిగ్గజ క్రికెటర్లు, సోదరులు ఈ దిగ్గజ స్పిన్నర్ మరణానికి సంతాపం తెలిపారు. 
       
క్రికెట్ లో ఎన్నో ఘనతలు సాధించిన వార్న్.. రెండు దశాబ్దాలపాటు ఆస్ట్రేలియా తిరుగులేని విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తన స్పిన్ తో ప్రత్యర్థులను వణికించి ప్రపంచంలోనే టాప్ స్పిన్నర్ గా ఎదిగాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్ లో 1000 కి పైగా వికెట్లు తీసిన షేన్ వార్న్ కు మెల్బోర్న్ క్రికెట్ ఈ దిగ్గజ స్పిన్నర్ కు ఘనమైన నివాళి ఇవ్వాలని భావిస్తుంది. ఇందులో భాగంగా ప్రేక్షకులకు ఉచితంగా గుండె పరీక్షలు చేయించడానికి సిద్ధమైంది.
 
ప్రస్తుతం పాకిస్థాన్ ఆస్ట్రేలియా పర్యటనలో 3 టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగా రెండో టెస్టు మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 న జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ చూడడానికి హాజరైన ప్రేక్షకులకు ఉచిత గుండె పరీక్షలను అందించనుంది. MCG టెస్ట్ చూసేవారందరూ  షేన్ వార్న్ ఫ్లాపీ టోపీలు ధరించాలని కోరారు. గత సంవత్సరం దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా వార్న్ కు నివాళులర్పించింది.