- జగిత్యాల ఎంసీహెచ్ డాక్టర్ల అరుదైన రికార్డు
జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ డాక్టర్లు అరుదైన రికార్డు సాధించారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 24 గంటల్లో 25 డెలివరీలు చేశారు. ఇందులో 13 నార్మల్ డెలివరీలు కాగా, 12 మందికి ఆపరేషన్లు చేశారు.
గర్భిణుల ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా డెలివరీలు చేస్తూ, తల్లీబిడ్డలను రక్షించిన డాక్టర్లను పలువురు ప్రశంసించారు. మొత్తం ప్రసవాల్లో నార్మల్ డెలివరీలు అధికంగా ఉండడంతో సూపరింటెండెంట్ రాములు వైద్య బృందాన్ని అభినందించారు.