కాంట్రాక్ట్​ ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యాలి : ఎండీ అబ్దుల్​ అజీజ్

కాంట్రాక్ట్​ ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యాలి : ఎండీ అబ్దుల్​ అజీజ్

ఇబ్రహీంపట్నం, వెలుగు : కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చెయ్యాలని రంగారెడ్డి జిల్లా సమగ్రశిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ అబ్దుల్​ అజీజ్​ డిమాండ్​ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్​లోని కలెక్టరేట్​ గేట్​ ముందు జిల్లా సమగ్రశిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం కాంట్రాక్ట్​ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు పగడాల యాదయ్య, నాయకుడు సామెల్​ సంఘీభావం తెలిపారు.

ఇచ్చిన హామీ మేరకు ఎస్​ఎస్​ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సమగ్రశిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు బుచ్చప్ప, మహిళా అధ్యక్షురాలు శ్రీలత, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్​, నాయకులు తదితరులు పాల్గొన్నారు.