ఓల్డ్ రామంతాపూర్ లో తీరనున్న సీవరేజీ కష్టాలు : అశోక్​రెడ్డి

ఓల్డ్ రామంతాపూర్ లో తీరనున్న సీవరేజీ కష్టాలు : అశోక్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ రామాంతాపూర్ లోని సీవరేజీ మెయిన్ పైపు లైన్ పునరుద్ధణ పనులు వెంటనే ప్రారంభించాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి పైపు లైన్ పనులను పరిశీలించారు. ఓల్డ్ రామంతాపూర్ ఏరియాలో మురుగు నీటిని నల్లచెరువు ఎస్టీపీలోకి మళ్లించి క్లీన్ చేసేందుకు నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ నిధులతో గతంలో పైపు లైన్ నిర్మించారు.

 దీని నిర్వహణ ఉప్పల్ మున్సిపాలిటీ.. ఆ తర్వాత బల్దియా పరిధిలోకి వెళ్లింది. సీవరేజీ నిర్వహణను వాటర్ బోర్డుకు బదలాయించి నప్పటి నుంచి బోర్డు పరిధిలోకి వెళ్లింది. అయితే.. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి అంబర్ పేట్ వరకు కొత్త రోడ్డు వేసే క్రమంలో పైపు లైన్ తో పాటు కొన్ని మ్యాన్ హోల్స్ మరమ్మతులకు గురయ్యాయి. దీంతో సీవరేజీ కష్టాలు తలెత్తాయి. సమస్యపై వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో తగు చర్యలు చేపట్టారు. వైప్ లైన్ పునరుద్ధరణ పనులు తక్షణమే ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.