
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వాటర్‌బోర్డు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో అధికారులు సీవరేజీ సమస్యలపై దృష్టిపెట్టాలని బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి సూచించారు. గురువారం ఆయన ఓఅండ్ఎం డివిజన్ 5 పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
బర్కత్ పురా, బాగ్ లింగంపల్లి, కింగ్ కోఠి, కాచిగూడలో జరుగుతున్న సీవరేజ్ టన్నెలింగ్, డీ-సిల్టింగ్ పనులను పరిశీలించారు. డిసెంబర్ లోపు పూర్తి చేయడానికి అవస రమైతే రెండు షిఫ్టుల్లో పనిచేయాలని సూచించారు. ధ్వంసమైన మ్యాన్ హోళ్లను గుర్తించి, కొత్త వాటి నిర్మించాలని చెప్పారు.