ఉమ్మడి జిల్లాలో గడ్డం వంశీ విస్తృత పర్యటన

కరీంనగర్‌‌‌‌‌‌‌‌/ గోదావరిఖని / పెద్దపల్లి/ధర్మారం, వెలుగు: కాంగ్రెస్ ​సీనియర్ ​నేత, చెన్నూర్​ ఎమ్మెల్యే కొడుకు, విశాక ఇండస్ట్రీస్​జేఎండీ గడ్డం వంశీకృష్ణ గురువారం ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పర్యటించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌, సుల్తానాబాద్‌‌‌‌, పెద్దపల్లి, ధర్మారం, గోదావరిఖని పట్టణాల్లో పర్యటించారు.  కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో హాస్పిటల్‌‌‌‌లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అనుచరుడు కామా విజయ్ తండ్రి రాజలింగం, ఓదెల గ్రామానికి జీపీ కార్మికుడు గుర్రాల సారయ్య, గోదావరిఖని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్న జనగామ గ్రామానికి చెందిన కార్తీక్‌‌‌‌ను పరామర్శించారు.

అనంతరం గోదావరిఖని దుర్గానగర్‌‌‌‌‌‌‌‌లోని ఎమ్మెల్యే ఎంఎస్​రాజ్‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌ నివాసంలో ఆయనను కలిసి సన్మానించారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్​ సమీపంలోని అంబేడ్కర్‌‌‌‌‌‌‌‌ విగ్రహానికి వంశీకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ధర్మారంలో వంశీకృష్ణకు కాంగ్రెస్​ లీడర్లు ఘన స్వాగతం పలికారు. వేర్వేరు కార్యక్రమాల్లో కాంగ్రెస్​లీడర్లు కాడే సూర్యనారాయణ, కొత్త నర్సింహులు, దేవి జనార్దన్, బ్రహ్మయ్య, ఎల్లయ్య, అజయపాల్ రెడ్డి, స్వామి, రాజేశం, తిరుపతి, చిరంజీవి, అష్రాఫ్, దేవి కిశోర్ పి.మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌, గోవర్ధన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, మధు, ఎ.భూషణ్‌‌‌‌‌‌‌‌, శివప్రసాద్‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌  పాల్గొన్నారు.