ఆలిండియా ఫారెస్ట్ ఆఫీసర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఎండీ అలీఖాన్

 ఆలిండియా ఫారెస్ట్  ఆఫీసర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఎండీ అలీఖాన్

న్యూఢిల్లీ, వెలుగు: ఆలిండియా ఫారెస్ట్ ఆఫీసర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా తెలంగాణకు చెందిన రాష్ట్ర డిప్యూటీ రేంజర్ ఎండీ మోజామ్ అలీఖాన్ గెలుపొందారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌‌‌లో జరిగిన ఫెడరేషన్ నేషనల్ మీటింగ్‌‌‌‌లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా పంజాబ్‌‌‌‌కు చెందిన ప్రదీప్ కుంబాడ, నేషనల్ జనరల్ సెక్రటరీగా తెలంగాణలోని గజ్వేల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పవన్ కుమార్, జాతీయ సహాయ కార్యదర్శిగా మెదక్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఆజం హుస్సేన్ ఎన్నికయ్యారు.