మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

నల్గొండ అర్బన్, వెలుగు: మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.21,000 ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ , ఎంప్లాయిస్ యూనియన్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం  డిమాండ్ చేశారు. ఆదివారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ .. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 15 రోజుల కింద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర కమిషనర్‌‌ను కోరామని,  లేదంటే  అక్టోబర్ 8 నుంచి సమ్మెకు వెళ్తామని చెప్పామన్నారు.

9న చర్చలకు ఆహ్వానించినందున విధులు నిర్వహిస్తూనే  నిరసన తెలిపామని,  చర్చలు సఫలం కాకుంటే 10 నుంచి  నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దండంపల్లి సత్తయ్య, పెరిక అంజమ్మ, పేర్ల సంజీవ, పెరిక కృష్ణ, పందుల లింగయ్య, చిక్కుల రాములు, వంగాల యాదమ్మ, సావిత్రమ్మ, పెరిక బిక్షం, కత్తుల కృష్ణవేణి, బొప్పని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.