దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నీలగిరి(ఫ్రీగేట్), ఐఎన్ఎస్ సూరత్(డిస్ట్రాయర్)లు నౌకాదళంలోకి చేరాయి. ఈ రెండు యుద్ధ నౌకలను మజగావ్ డాక్స్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్), ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరోలు సంయుక్తంగా దేశీయంగా అభివృద్ధి చేశాయి.
ఐఎన్ఎస్ నీలగిరి
మజగావ్ డాక్స్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ముంబయి), గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజినీర్స్ లిమిటెడ్(కోల్‌కతా)లు ప్రాజెక్ట్ 17ఏ కింద నిర్మిస్తున్న ఏడు పీ17ఏ యుద్ధనౌకల్లో నీలగిరి మొదటిది. దీనిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇందులో అమర్చిన అధునాతన సాంకేతికత ఆయుధాలు, సెన్సర్ల ద్వారా శత్రుదేశాల జలంతర్గాములు, ఉపరితల యుద్ధనౌకలు, యాంటీ షిప్ క్షిపణులు, యుద్ధ విమానాలను ఎదుర్కోగలదు.
ఐఎన్ఎస్ సూరత్
ప్రాజెక్ట్ 15 బి కింది నిర్మిస్తున్న నౌకల్లో నాలుగోది ఐఎన్ఎస్ సూరత్. యుద్ధనౌక సూరత్‌లో బ్రహ్మోస్ క్షిపణులు, బరాక్–8 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు, దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ సబ్ మెరైన్ ఆయుధాలు, సెన్సార్లు అమర్చారు.
ALSO READ | RRB Group D Recruitment: రైల్వేలో 32 వేల 438 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే