మాజ్‌గావ్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్... రెగ్యులర్ ప్రాతిపదికన 234 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. అభ్యర్థులు డిసెంబర్ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, ఎన్‌ఏసీ పరీక్ష, డిప్లొమా, డిగ్రీ, పీజీ, సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ (ఫస్ట్ క్లాస్ మాస్టర్) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. మాస్టర్ ఫస్ట్ క్లాస్/ యాక్ట్ ఇంజినీర్‌కు లైసెన్స్ ట్రేడుకు గరిష్ఠంగా 48 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఉద్యోగానుభవం, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్స్: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్ 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ జనవరి 15న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.mazagondock.in వెబ్సైట్లో సంప్రదించాలి.