Israel, Iran War:శతృత్వంతో ఎవరీకి లాభం ఉండదు..ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి..భారత్ స్పందన

Israel, Iran War:శతృత్వంతో ఎవరీకి లాభం ఉండదు..ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి..భారత్ స్పందన

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్ధృతిపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ సైనిక స్థావరపై ఇజ్రాయెల్ దాడులు చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. అమాయక పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇరు పక్షాలు  సంయమనం పాటించాలని, చర్చలు, దౌత్యపరమైన చర్యల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కొనసాగించాలని కోరింది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్న భారతీయ పౌరులతో సంప్రదింపులు జరుపుతున్నామని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టర్నర్ ఎఫైర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. 

శనివారం ఇరాన్ లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులు రెండు భారీ సాయుధ దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్దం జరుగుతుందనే భయాలను మరింత పెంచింది. ‘‘సంయమనం పాటించాలి.. చర్చలు, దౌత్య మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరాన్, ఇజ్రాయెల్ నేతలను అన్ని దేశాలు పిలుపునిస్తున్న విషయాన్ని భారత్ నొక్కి చెప్పింది. అమాయక బందీలు, పౌరులపై దాడులు జరుగుతున్నాయి.. శతృత్వాలు ఎవరికీ ప్రయోజనం కలిగించవు ’’ MEA స్పష్టం చేసింది.