జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ లో దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది సెన్స్ లెస్, హారిఫీక్ అటాక్ అని మండిపడింది.ఎంతో మంది విలువైన ప్రాణాలు కోల్పోగా..అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది.
Press release: India condemns attack in Magdeburg, Germanyhttps://t.co/3nA9nNmPVm pic.twitter.com/8ZIW0GHnCm
— Randhir Jaiswal (@MEAIndia) December 21, 2024
శుక్రవారం (20)న జర్మనిలోని మాగ్డేబర్గ్ లో రద్దీగా ఉంటే క్రిస్మస్ మార్కెట్ లో సౌదీకి చెందిన డాక్టర్ తన కారుతో జనంతో దూసుకుపోవడం ద్వారా దాడి చేశారు. ఈ దాడిలో చిన్నారి తో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. దాదాపు 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ తయోబ్ ను 50ఏళ్ల సౌదీ డాక్టర్ గా గుర్తించి అరెస్ట్ చేశారు.
ALSO READ | యూట్యూబర్: ప్రేమ..పెళ్లి..ప్రయాణం..
జర్మనీ క్రిస్మస్ మార్కెట్ లో దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది..ఈ దాడి హారిఫిక్.. సెన్స్ లెస్.. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.. అని భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. బాధితులతో మేమున్నాం..ఇండియన్ ఎంబసీ అక్కడి భారతీయ కుటుంబాలతో చర్చలు జరుపుతోంది.. బాధితు కుటుంబాలను సాధ్యమైనంత వరకు సహాయాన్ని అందిస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.