ములకలపల్లిలో మధ్యాహ్న భోజన కార్మికుల భిక్షాటన

ములకలపల్లి, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆరు రోజులుగా ములకలపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం భిక్షాటన నిర్వహించారు. 

కార్మికుల సంఘం మండల కార్యదర్శి బుగ్గ వెంకట నరసమ్మ, మాజీ సర్పంచ్ గడ్డం వెంకటేశ్వర్లు, నాయకులు నల్లి సుజాత, కొర్రి పద్మ, సీత, అంజమ్మ, అనసూర్య, ఇందిర, కాంతి  అలివేలు  తదితరులు పాల్గొన్నారు.