
సిద్దిపేట, వెలుగు : కేథార్నాథ్ లో యాత్రికులకు సిద్దిపేట వాసులు ఉచిత భోజనాలు అందించారు. ఆలయానికి వందల కిలో మీటర్ల దూరంలో సిద్దిపేట వాసులు లంగర్ ను ఏర్పాటు చేసి రోజు యాత్రికులకు ఉచితంగా ఉపహారంతో పాటు భోజనాలు అందిస్తున్నారు. ఈనెల 10న యాత్ర ప్రారంభమైన నుంచి దాదాపు 40 రోజుల పాటు యాత్రికులకు సిద్దిపేటకు చెందిన ప్రత్యేక బృందం భోజనాలను అందిస్తూ తమ సేవలను అందిస్తున్నారు. కేథార్నాథ్ యాత్ర ముగించే వరకు తమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని చీకోటీ మధుసూధన్ తెలిపారు.