
అమెరికాలో తట్టువ్యాధి విజృంభిస్తోంది.ఈ ఏడాది ప్రారంభం నుంచి తట్టు బారిన పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి నెల టెక్సాస్లో ఒకరు మార్చి నెల ప్రారంభంలో న్యూమెక్సికోలో ఇంకో చిన్నారి మృతి చెందింది. తాజాగా టెక్సాస్ లో మరో చిన్నారి మృతి చెందడం కలకలం రేపుతోంది. చిన్నారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికి తట్టు వైరస్ కారణంగానే మరణించాడని యూనివర్సిటీ మెడికల్ సెంటర్(UMC)హెల్త్ సిస్టమ్ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది అమెరికా వ్యాప్తంగా 21 రాష్ట్రాలలో 607 మీజిల్స్ కేసులను నమోదు అయినట్లు US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఈ నిర్ధారించింది. ఇది 2023 మొత్తానికి రెట్టింపు కంటే ఎక్కువ. ఒక్క టెక్సాస్‌లో లోనే 481 కేసులు నమోదు అయ్యాయి.
Also Read : సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంటువ్యాధి వైరస్లలో మీజిల్స్ ఒకటి. టీకా ద్వారా నివారించవచ్చు. అయితే ప్రస్తుతం యూఎస్ లో 97 శాతం కేసులలో టీకాలు వేయని వ్యక్తులు లేదా టీకా గురించి తెలియని వారే అని CDC తెలిపింది.
2000 లో మీజిల్స్ నిర్మూలించబడినట్లు అమెరికా ప్రకటించింది. అంటే ఆ ఏడాది మాత్రమే మీజిల్స్ పూర్తిగా వ్యాప్తిగా జరగలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న మీజిల్స్ వ్యాప్తి ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.