కరోనా కట్టడికి కేంద్రం పలు సూచనలు, సలహాలు చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కోవిడ్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోవిడ్ వేరియంట్‌లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని కేంద్రం చెప్పిందన్నారు. ఈనెల 27వ తేదీన కోవిడ్ కట్టడికి సంబంధించిన విషయాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సూచించారు.
మరిన్ని వార్తల కోసం..