తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి :కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్ , వెలుగు:   వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా  యాక్షన్ ప్లాన్ రూపొందించాలని  కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. గురువారం  కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ    బోరు బావులు,హ్యాండ్ పంపుల  మరమ్మతులు చేపట్టాలని, నీటి వనరులపై నివేదిక  ఇవ్వాలని ఆదేశించారు.  ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ట్రైబల్, వెనుకబడిన తరగతుల  వసతి గృహాల్లో    తాగునీరు అందించాలన్నారు.ఈ సమావేశంలో మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ సురేందర్, డిపివో హరి ప్రసాద్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.