
- గోదావరిలో నీటి నిల్వకు శాండ్ బెడ్‌లు
- మేడిపల్లి ఓసీపీ, జీడీకే11 ఇంక్లయిన్ నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్‌లోని కార్మిక కుటుంబాలు, ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు మేనేజ్‌మెంట్ చర్యలు చేపట్టింది. గోదావరిలో ఇంటెక్వెల్స్వద్ద నీరు నిలిచేలా ప్రవాహానికి అడ్డంగా శాండ్ బెడ్‌లను ఏర్పాటు చేసింది. గోదావరి ఒడ్డున గల ఇంటెక్వెల్నుంచి రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ 1, ఆర్జీ 2, ఆర్జీ 3 ఏరియాల పరిధిలోని సుమారు 12 వేల క్వార్టర్స్‌కు అనధికారికంగా ఉన్న మరో 25 వేల ఇండ్లకు సింగరేణి వాటర్ సప్లై చేస్తోంది. నీటి సప్లై కోసం నదిలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వదిలే నీటిని వినియోగించుకునేందుకు ఇన్‌ఫిల్ట్రేషన్ గ్యాలరీల చుట్టూ తాత్కాలికంగా శాండ్ బెడ్‌లను ఏర్పాటు చేశారు.
దీంతోపాటు ఎల్లంపల్లిలో ప్రాజెక్ట్‌లో నిల్వలు తగ్గి నీరు రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మూసివేసిన మేడిపల్లి ఓసీపీలోని కందకాల్లో ప్రస్తుతం 33 వేల లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. గోదావరి ఒడ్డునే ఈ ఓసీపీ ఉండడంతో వర్షపు నీటితో పాటు నది ఊట నీరు వచ్చి చేరింది. వేసవి కాలంలో ఈ నీటిని వినియోగించుకునేలా మేడిపల్లి ఓసీపీ నుంచి గంగానగర్ ఫిల్టర్ బెడ్ వరకు రెండు వరుసల్లో పైప్‌లైన్ వేశారు.
ఇక్కడి నుంచి ప్రతి నిమిషానికి వెయ్యి గ్యాలన్ల నీటిని ఫిల్టర్‌బెడ్‌కు సప్లై చేసే అవకాశం ఉంది. అలాగే జీడీకే 11 ఇంక్లైన్అండర్ గ్రౌండ్మైన్లో ఊటగా వచ్చే నీటిని నిల్వ చేస్తుండగా, దీనిని కూడా వాడుకునేందుకు ఆ మైన్ నుంచి సెక్టార్2లోని ఫైవింక్లయిన్ ఫిల్టర్ బెడ్వరకు పైప్‌లైన్ నిర్మించారు. ఇక్కడి నుంచి ప్రతి నిమిషానికి 800 గ్యాలన్ల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. దీనిపై సింగరేణి ఏరియా జీఎం లలిత్‌కుమార్ మాట్లాడుతూ సింగరేణి ఏరియాలో కార్మిక కుటుంబాలు, ప్రజలకు తాగునీటి కొరత రానివ్వకుండా చర్యలు తీసుకుంటామన్నారు.