వేములవాడ, వెలుగు : వేములవాడ పట్టణంలోని మురుగు నీరు గుడిచెరువు, మూలవాగులో కలవకుండా రూ.9కోట్లతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 22వ వార్డులో నిర్వహించిన వార్డు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు.
లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ నెల 26న పంపిణీ చేస్తామన్నారు. వేములవాడకు అదనంగా మరో 4,696 ఇండ్లు మంజూరు కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్, ఏంఎసీ చైర్మన్ రొండి రాజు, కౌన్సిలర్ అజయ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ మహేశ్‌మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, లీడర్లు, పాల్గొన్నారు.