హైదరాబాద్ సిటీ, వెలుగు: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం గ్రేటర్ పరిధిలోని మాంసం షాపులను క్లోజ్చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 533(బి) ప్రకారం సీరియస్యాక్షన్తీసుకుంటామని స్పష్టం చేశారు. చికెన్, మటన్ షాపులతోపాటు మేక, గొర్రెల మండీలను మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అందరూ పాటించాలని కోరారు.