మక్కా: సౌదీ అరేబియాలోని ఇస్లాం పవిత్ర నగరం మక్కా నీట మునిగింది. ఉరుములు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు మక్కా, మదీనా, జెడ్డా నగరాలను ముంచెత్తాయి. జెడ్డా సిటీతో పాటు పరిసర ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. దీంతో కొన్ని చోట్ల వరదల్లో కార్లు కొట్టుకుపోయాయి. కార్లతో పాటు బస్సులలో చాలా మంది చిక్కుకుపోయారు.
వారిని రక్షించేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. అల్-అవాలి ప్రాంతంలో చిన్నపిల్లలు వరద నీటిలో చిక్కుకోగా.. స్థానికులు చైన్లా మారి వారిని కాపాడారు. ఈ వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.