చండ్రుగొండ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి రెండోసారి గెలిపిస్తే చండ్రుగొండ మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఓటర్లను కోరారు. శుక్రవారం మండలంలోని మద్దుకూరు, దామరచర్ల, రామక్కబంజరు, అయ్యన్నపాలెం, చండ్రుగొండ, ఇమ్మడిరామయ్య బంజరు, బెండాలపాడు, గుర్రాయిగూడెం గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు.
అనంతరం చండ్రుగొండ లో కొత్తగూడెం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంకా రాంబాబు, బీజేపీ జిల్లా నాయకులు జి. జ్యోతి నాయక్, రాంబాబు నాయక్, కాంగ్రేస్ నాయకులు కన్నయ్య, కిషన్ గౌడ్, టీడీపీ లీడర్లు యాకూబ్ అలీ, మల్లేశ్ కు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్ట ఈలీడర్లు కోనేరు సత్యనారాయణ, దారా వెంకటేశ్వరావు, పవన్ కుమార్, సూరా వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ పాల్గొన్నారు.