
ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. లేటెస్ట్ గా ఓ విద్యార్థి క్రికెట్ ఆడుతూ గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సీఎంఆర్ కాలేజ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఏప్రిల్ 4న సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కాలేజ్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాడు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా.. గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే విద్యార్థులు అతడిని హాస్పటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు.
►ALSO READ | ముంబైలో దుమ్ము తుఫాను.. భారీ వర్షానికి ముందు బీభత్సం..
స్నేహితుడు కళ్ల ముందే కుప్పకూలిపోయి మృతి చెందడంతో విద్యార్థులు కన్నీరు మున్నీరు అయ్యారు. విద్యార్థి గుండెపోటుకు గురై కుప్పకూలిపోయిన ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అయితే దీనిపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు రాలేదని మేడ్చల్ సీఐ తెలిపారు.