
ఐదురోజుల క్రితం వెలుగు చూసిన శ్రావణి హత్యకేసు రాష్ ట్రవ్యా ప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను అరెస్టు చేయాలని అదేరోజు హాజిపురం గ్రామస్థులు పెద్ద ఎత్తు న ఆందోళనకు దిగారు.దీంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్పెషల్ ఇన్వెస్టిగే షన్ టీమ్(సిట్ ) ను ఏర్పాటు చేశారు. శ్రావణి మృతదేహం బయటపడ్డ మరుసటి రోజు హాజిపురం గ్రామానికే చెందిన శ్రీనివాస్‍రెడ్డి(30)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. మనీష హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిం ది. శ్రావణి, మనీష మృతదేహాలు రెండూ శ్రీనివాస్‌రెడ్డికి చెందిన పాడుబడ్డబావిలోనే దొరికాయి . దీన్ని బట్టి శ్రీనివాస్‌రెడ్డే ఆ ఇద్దరిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ ఆ రాతీ స్తున్నారు. నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పన కేసును , నెలన్నర క్రితం జరిగిన ఓ మహిళ ఉదంతంపైనా దృష్టి సారించారు.
లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసి…
శ్రీనివాస్‌రెడ్డికి పెళ్లి కాలేదు. లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసేవాడు. బెంగుళూరులో లిప్ట్ మెకానిక్ పని నేర్చుకొని కొంతకాలం అక్కడే పనిచేసి, ఏపీలోని కర్నూలుకు వెళ్లాడు. అక్కడా కొంత కాలం లిప్ట్ మెకానిక్ గా పనిచేశాడు. అదే సమయంలో కర్నూలులో ఓ మహిళ అత్యా చారానికి, హత్యకు గురైంది. ఈ కేసులో శ్రీనివాస్‍రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కర్నూలులో పనిచేశాక..వరంగల్‌కు వెళ్లాడు. కొన్నాళ్ల నుంచి సొంతూరు హాజిపురంలోనే ఉంటూ గంజాయికి బానిసై సైకోగా మారాడు. ఆ మత్తు లో ఘాతుకాలకు తెగబడేవాడని గ్రామస్థులు చెప్తున్నారు. గతంలో ఓ పల్సర్ బైక్ ను ఎత్తు కొచ్చి తన పొలంలోనే పాతిపెట్టాడని, ఇటీవల బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద రాయల్ ఎన్‍ఫీల్డ్ బైక్ ను ఎత్తు కొచ్చాడని వారు పేర్కొంటున్నానారు. శ్రీనివాస్‍రెడ్డి ప్రవర్తనను చూసి స్థానికులు ఎవరూ అతడితో స్నేహం చేసేవారు కాదని చెప్తున్నారు.
పాడుబడ్డ బావులు అడ్డగా…
హైదరాబాద్ లోని ఈసీఐఎల్‍కు కొన్ని కిలోమీటర్ల దూరంలో హాజిపురం ఉంటుంది. ఇక్కడి పాడుబడ్డ బావుల దగ్గర కొందరు గంజాయి దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడే వారు గంజాయిని పీల్చి అసాంఘిక కార్యకలాపాలకు తెగబడుతున్నారని, అధికా రులు ఎవరూ పట్టించు కోవడం లేదని గ్రామస్థులు అంటున్ నారు. దారి వెంట వెళ్లే మహిళలను పాడుబడ్డ బావి వద్ద గంజాయి ముఠా అటకాయించేదని గుర్తుచేస్తున్ నారు. శ్రావణి, మనీష కూడా ఇవే బావుల వెంట నడుచుకుంటూ వెళ్లి దారుణ హత్యకు గురయ్యా రని చెప్తున్నారు. ఈ కేసుల్లో పోలీసులు ఇప్పటికే ఎనిమిదిమంది యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శ్రావణి,మనీష మృతదేహాలు బయటపడ్డ పాడుబడ్డ బావి నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిదే. దాని పక్కనే మరో పాడుబడ్డ బావి ఉంది. అది కూడా అతడిదే. ఆ బావిలోనూ మృతదేహాలు ఉండొచ్చని, విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.