ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించండి: మేచినేని కిషన్రావు

ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించండి: మేచినేని కిషన్రావు
  • 1969 ఉద్యమకారుల సమితి ప్రెసిడెంట్ మేచినేని కిషన్ రావు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని 1969 ఉద్యమ కారుల సమితి ప్రెసిడెంట్, మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు కోరారు.1969 ఉద్యమకారుల త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలిసేలా100 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గురువారం బంజారా హిల్స్ లో కిషన్ రావు మీడియాతో మాట్లాడారు.

గన్ పార్క్ శిల్పి ఎక్కా యాదగిరిని రాష్ర్ట ప్రభుత్వం సన్మానించాలన్నారు. ఉద్యమకారుల సమస్యలు చెప్పుకునేందుకు కేసీఆర్ ఎన్నడూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. ఆ తర్వాత సెక్రటరీ జనరల్ దుశ్చర్ల సత్యనారాయణ మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచిన ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు.1969 ఉద్యమకారుల సమస్యలు, డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబును కోరగా, మేనిఫెస్టోలో చేర్చారని వెల్లడించారు.

ఉద్యమకారులను గుర్తించడానికి చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం 1969 ఉద్యమకారులు సుమారు 300 మంది ఉన్నారని, తరువాత ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా కమిటీ గుర్తించాలన్నారు. ఉద్యమంలో మరణించిన 1200 అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన సూచించారు.