
ఎంఈసీఓఎన్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
- ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి మెటలర్జికల్ అండ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా(ఎంఈసీఓఎన్) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు మే ఏడో తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
- పోస్టుల సంఖ్య02: డిప్యూటీ మేనేజర్ (సోషియో ఎకానమిక్ ఈ–2 గ్రేడ్) 01, సీనియర్ మేనేజర్ (ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఈ–4 గ్రేడ్) 01.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్ లేదా బీఈ, ఏదైనా పోస్టు గ్రాడ్యుయేట్, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 8.
- అప్లికేషన్ ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.
- లాస్ట్ డేట్: మే 7.
ఏఏఐలో జూనియర్ ఎగ్జిక్యూటివ్
- వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు మే 25వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
- పోస్టుల సంఖ్య: జూనియర్ ఎగ్జిక్యూటివ్ 309.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్ లేదా బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 25.
- లాస్ట్ డేట్: మే 24.
- సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనంతరం షార్ట్ లిస్ట్ చేస్తారు. అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకో అక్టివ్సబ్స్టెన్స్ టెస్ట్, సైకలాజికల్ అసెస్ మెంట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.