'బేటీ బచావో బేటి పడావో ' కు  ప్రచారం కల్పించాలి : అడిషనల్​ కలెక్టర్ నగేశ్​

'బేటీ బచావో బేటి పడావో ' కు  ప్రచారం కల్పించాలి : అడిషనల్​ కలెక్టర్ నగేశ్​

మెదక్, వెలుగు: బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని, బాలిక సాధికారతలో మెదక్​ జిల్లాను ఫస్ట్​ ప్లేస్​లో నిలిపేందుకు కృషి చేయాలని అడిషనల్​ కలెక్టర్​ నగేశ్ అధికారులకు సూచించారు.  బేటీ బచావో  బేటి పడావో  పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

సోమవారం కలెక్టరేట్ లో  బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి హైమావతి, అడిషనల్​ ఎస్పీ మహేందర్ తదితర శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేశ్​మాట్లాడుతూ ఆడపిల్లల ఎదుగుదలకు సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందనే విషయంపై ప్రచారం కల్పించాలన్నారు.