మెదక్టౌన్, వెలుగు: మెదక్ చర్చి నిర్మాత చార్లెస్వాకర్పాస్నెట్మనవరాలు జూలియా, వారి బంధువులు ఎలిజబెత్, మైకేల్, క్యారెల్, ఫ్రాంక్లిన్ ఆదివారం చర్చిని సందర్శించారు. ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య, చర్చి బాధ్యులతో మాట్లాడుతూ చర్చి నిర్మించి వందేళ్లు కావడస్తుండడంతో ఏర్పాట్ల గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా పాస్నెట్మనవరాలితో పాటు వారి బంధువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చర్చి బాధ్యులు గంట సంపత్, శాంసన్, సందీప్ పాల్గొన్నారు.