మెదక్ టౌన్, వెలుగు: మెదక్ చర్చి వందేళ్ల వేడుకల నేపథ్యంలో రోజూ భక్తులు, ప్రముఖులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా సోమవారం మెదక్ చర్చిని నిర్మించిన చార్లెస్ వాకర్ పాస్నెట్‌కు సంబంధించిన మూడు తరాల వారసులు లండన్ నుంచి వచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చి ఇన్ చార్జి బిషప్ రెవరెండ్ రూబెన్ మార్క్ ప్రార్థనలు నిర్వహించి వారిని శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చికి రావడం.. ప్రార్థనలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
మునిమనుమలు, మనుమరాళ్లు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ చర్చిని మాజీ మంత్రి హరీశ్‌రావు దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిని ఇంగ్లాండ్‌కు చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫాస్నెట్ 1914లో ప్రారంభించగా... 1924 డిసెంబర్ 25న పూర్తయ్యిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, తదితరులు పాల్గొన్నారు.