క్రిస్‌మస్ వేడుకలకు ముస్తాబైన మెదక్ చర్చి

క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబైంది. ఎంతో ప్రత్యేకత ఉన్న ఆసియాలోనే అతిపెద్ద చర్చి అయిన మెదక్ చర్చి రంగు రంగుల విద్యుత్ దీపాల ధగధగలతో మెరిసిపోతోంది. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

మెదక్ చర్చికి ఉన్న చరిత్ర.. ప్రత్యేకతల దృష్ట్యా తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు రద్దీని క్రమబద్దీకరిస్తూ.. భక్తులకు సూచనలు ఇస్తున్నారు. 

విద్యుత్ దీపాల వెలుగులో డోర్నకల్ సీఎస్ఐ చర్చి  

రాష్ట్రంలో మెదక్ చర్చ్ తర్వాత  రెండవ చేర్చిగా కిర్తిoపబడుతున్న మహబూబాబాద్ జిల్లా  డోర్నకల్ సి.యస్.ఐ చర్చ్   క్రిస్టమస్ వేడుకల ప్రత్యేక ఆరాధన మహోత్సవాల కోసం  రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు  సకల సౌకర్యాలు సిద్దం చేశారు.  డోర్నకల్ మండల కేంద్రం లోని చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సి.యస్.ఐ)కి చెందిన చర్చి కుల మతాలకు అతీతంగా నిలిచి అన్ని వర్గాల ప్రజలను  విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం రాష్ట ప్రజలనే కాక దేశ విదేశాలనుండి వచ్చి ఎంతో మంది యాత్రికులు ఈ చర్చిని సందర్శిస్తుంటారు. క్రైస్టవులతో పాటు హిందూ ముస్లిం వర్గాల ప్రజలు ఈ చర్చి నిర్మాణ శైలిని, కాళసౌరబాన్ని వేనోళ్ల కొనియడారు.

డోర్నకల్  చర్చి నిర్మాణ చరిత్ర

1939 జనవరి 6వ తేదిన ఇండియా మెట్రోపాలిటన్ బిషప్ ఆయన ది మోస్టు రెవరెండ్ ఫాస్ నెస్టు కాట్ ఆధ్వర్యంలో డోర్నకల్ కేతేడ్రిల్ చర్చి ప్రతిష్టాపన జరిగింది.ఈ చర్చిని క్రైస్తవులు పండగ "ఎఫిఫని"నాడు ప్రారంభించారు. శిలువ వేయడానికి క్రీస్తు మరణాన్ని జయంచి పునరుద్దుడై అన్యులకు ప్రత్యక్షమైన రోజునే ఆనవయతిగా ఈ "ఎఫిఫని"పండుగను జరుపుకుంటారు. త్రైయేక దేవుని ఆరాధన కోసమే డోర్నకల్ లో ఈ కేతెడ్రిల్ ఆవిర్బవించింది.1915 సంవత్సరంలో అప్పటి మద్రాస్ (చెన్నై )5 వ బిషప్ హేన్సి మైట్ హెడ్ ఈ ప్రత్యక్ష మహాదేవాలయానికి శంకుస్థాపన చేశారు.

24సంవత్చరాల పాటు నిర్విరామంగా శ్రమించి  నిర్మాణం పూర్తి చేశారు. ఈ చేర్చి దక్షణ భారత దేశంలోనే ప్రముఖమైనదిగా పేరు పొందింది.  ఈ చర్చిని దర్శిస్తే అద్భుత కాళాఖండం మదిలో మెదులుతుంది. ఈ చర్చి నిర్మాణంలో ద్రావిడ, హిందూ, ముస్లిం,  క్రైస్తవుల శిల్ప సంప్రదాయాలు సమ్మేళనంలా  ప్రకాశిస్తూన్నాయి.  మొదటి బిషప్ అజరయ్య కృషితోనే ఈ చర్చి రూపొందినట్లు పూర్వీకుల కథనం. దూర ద్రుష్టి గల ఆయన ఆలోచన సరళిని అనుసరించి స్వదేశీ శిల్ప నిర్మాణంతో తీర్చిదిద్దిన సాటిలేని మేటికట్టడంగా రూపుదిద్దుకుంది. 

ఈ చర్చి ముఖ శిఖరాలు మసిదులలో మాదిరిగా గుమ్మటలను పోలి ఉన్నాయి. శిఖరాల మీద అధో ముఖంగా పూచిన పద్మలు (లోటస్ ) వాటిమీద రెండు శిలవలు (క్రాస్ )ఉన్నాయి. లోపల గల 12 స్తంభాలు ద్రావిడ శిల్పకళా రీతిలో  ఉన్నాయి.  స్తంభాల శిఖరాలు హైందవ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. శిల్ప శోభితమైన ఈ రెండు స్తంభాలతో ఉన్న మండపంలో రజత కోటలోని నక్షత్రం ఉంది.  రాతి స్తంభాలకు ఇరు ప్రక్కల వికసించిన ఉమ్మెత్త పూలు, అరటి మొగ్గలు ఉన్నాయి.