దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ​కలెక్టర్ ​రాహుల్ రాజ్​

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ​కలెక్టర్ ​రాహుల్ రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మెదక్​కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలో మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి,  వైద్య ఆరోగ్యశాఖల సమన్వయంతో ‌‌‌‌టీఎన్జీవో భవనంలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసినఉచిత బ్యాటరీ ట్రైసైకిల్ ఎంపిక, కృత్రిమ అవయవాల కొలతల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల  వైకల్యానికి అనుగుణంగా పరికరాల పంపిణీకి ముందుకు వచ్చిన అలీమ్ కో  స్వచ్ఛంద సంస్థ సేవలను అభినందించారు.

దివ్యాంగుల సమస్యలను తెలుసుకుని  భరోసా కల్పించారు .  దివ్యాంగుల పరికరాల శిబిరాలను గురువారం రామాయంపేటలో,  శుక్రవారం నర్సాపూర్​లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన దివ్యాంగులకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ డాక్టర్​ను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో హైమావతి, డీఆర్​డీవో శ్రీనివాస్​రావు, ఆర్టిఫిషియల్ లింబ్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఆలింకో) స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రసన్నకుమార్, రాజబాబు, సురేంద్ర, డాక్టర్ సురేందర్ పాల్గొన్నారు.