విదేశీ ఆఫీసర్లకు మెదక్​ కలెక్టర్​ గెస్ట్​లెక్చర్

విదేశీ ఆఫీసర్లకు మెదక్​ కలెక్టర్​ గెస్ట్​లెక్చర్

మెదక్, వెలుగు: ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో వివిధ దేశాల సివిల్ సర్వీస్ అధికారులకు మెదక్​ జిల్లా కలెక్టర్​రాహుల్​రాజ్​సోమవారం గెస్ట్​ లెక్చర్​ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎస్​సీజీజీ) ఆధ్వర్యంలో సౌత్ ఈస్ట్ ఆసియా,  ఇండియన్ ఓషియన్ రీజీయన్ దేశాల సివిల్ సర్వీసెస్​ఆఫీసర్లకు 'స్థానిక పాలనలో సామర్థాల పెంపు' అనే అంశంపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మెదక్​ కలెక్టర్ రాహుల్ రాజ్ ను ఆహ్వానించి గెస్ట్​ లెక్చర్​ఇప్పించారు.

ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక పాలన తీరును విదేశీ సివిల్​సర్వీసెస్​అధికారులకు వివరించడంతోపాటు, తన అనుభవాలను వారితో పంచుకున్నారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, సందేహాలు నివృత్తి చేశారు.  సమర్థవంతమైన స్థానిక పాలనపై సలహాలు, సూచనలు అందించారు. గత సంవత్సరం కూడా రాహుల్​రాజ్​బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ అధికారులకు ఢిల్లీలో,  ట్రైనీ సివిల్ సర్వీస్​ అధికారులకు ముస్సోరి ఐఏఎస్ ​అకాడమీలో లెక్చర్లు ఇచ్చారు.