నాణ్యమైన భోజనం అందించాలి : రాహుల్​ రాజ్​

నాణ్యమైన భోజనం అందించాలి : రాహుల్​ రాజ్​
  • మెదక్​ కలెక్టర్​ రాహుల్​ రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మెదక్​ కలెక్టర్​ రాహుల్​రాజ్​ అన్నారు. బుధవారం మెదక్​ పట్టణంతోపాటు మండలంలోని మండల పరిధిలోని పాతూరులో ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్​ లక్ష్మణ్​బాబుతో కలిసి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి ఐదెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆయన పరిశీలించారు. 

సంబంధిత నివేదికలు సిద్ధం చేసి అందజేయాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న ఆహారం, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు డైనింగ్ హాల్, క్లాస్ రూములు, పరిసరాలు, స్టోర్స్, వంట గదులను స్వయంగా తనిఖీ చేశారు. కిచెన్ షెడ్ లో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్​వెంట ఆర్ఐ లక్ష్మణ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.