గ్రామాల అభివృద్ధిలో సెక్రటరీలదే కీరోల్​ : కలెక్టర్​ రాహుల్ రాజ్​

గ్రామాల అభివృద్ధిలో సెక్రటరీలదే కీరోల్​ : కలెక్టర్​ రాహుల్ రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీల పనితీరు కీలకం కావాలని మెదక్​ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో డివిజనల్, మండల స్థాయి పంచాయతీ అధికారులు,  గ్రామ పంచాయతీ సెక్రటరీలు, కంప్యూటర్ ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతిరోజు నిర్వహించే శానిటేషన్, హౌస్ ట్యాక్స్​ కలెక్షన్, గ్రామపంచాయతీ ఇన్స్​పెకక్షన్లు, ట్రేడ్ లైసెన్స్, సెల్ టవర్ లైసెన్స్, ఇంటి పర్మిషన్లు, మల్టీపర్పస్ వర్కర్స్ వేతనాలు సంబంధిత అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.

పంచాయతీ సెక్రటరీలు సంక్షేమ పథకాలు అమలులో వారి పనితీరు హర్షణీయమని, ఇదే స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు. సంక్షేమ పథకాల ఆన్​లైన్​ డేటా ఎంట్రీలో వంద శాతం పురోగతి సాధించాలని సూచించారు. గ్రామాలు స్వచ్ఛతకు నిలయాలుగా మారాలని పంచాయతీ సెక్రటరీల పనితీరుతోనే అది సాధ్యపడుతుందని కలెక్టర్ వివరించారు. అడిషనల్​ కలెక్టర్​ నగేశ్, డీపీవో యాదయ్య, డీఎల్​పీవోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

నేషనల్​కి సెలక్ట్​ కావడం అభినందనీయం

క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ శాఖల ఉద్యోగులను కొనియాడారు. ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్​లో నిర్వహించిన రాష్ట్రస్థాయిపోటీల్లో జిల్లా నుంచి 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

బుధవారం కలెక్టరేట్ లో క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైన విద్య, వ్యవసాయం, పంచాయతీ విభాగాల ఉద్యోగులను ఆయన సన్మానించారు. జాతీయ స్థాయి క్రీడలకు క్యారమ్స్​లో సతీశ్, తూప్రాన్​మండల పంచాయతీ అధికారి, రన్నింగ్​లో రాజశేఖర్​ గౌడ్​ (ఏఈవో), హాకీలో శ్వేతా కుమారి, శారదలు ఎంపికయ్యారు.