
- సర్ధన పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్టౌన్, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, డాక్టర్లు, సిబ్బంది విధులను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. ఆదివారం హవేలీ ఘనపూర్ మండలంలోని సర్ధన పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.
వసతులు సక్రమంగా ఉన్నాయా లేవా అని ఆరా తీశారు. ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో మందులు అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.