బాలింతలు, గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించాలి : రాహుల్ రాజ్

బాలింతలు, గర్భిణులకు  నాణ్యమైన భోజనం అందించాలి : రాహుల్ రాజ్
  • కలెక్టర్ రాహుల్ రాజ్  
  • పిల్లికొటాల్ లో మాతా శిశు ఆరోగ్య కేంద్రం పరిశీలన 

మెదక్, వెలుగు: గర్భిణులు, బాలింతలకు అందించే  భోజనం  నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు.  సోమవారం జిల్లా కేంద్రంలోని పిల్లికొటాల్ లో  ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీడియాట్రిక్ వార్డు, గైనిక్ వార్డు, పోస్ట్ ఆపరేషన్ వార్డులను సందర్శించారు. అనంతరం క్యాంటీన్ లో  ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. 

నాణ్యతలో రాజీ పదొడ్డని నిర్వాహకులకు సూచించారు. డాక్టర్ లతో కలిసి రోగులకు అందించే భోజనాన్ని కలెక్టర్  తిన్నారు. ఏం సీ హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ దయాల్, ఆర్ఎంఓ షర్మిల, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్  డాక్టర్ రవీంద్ర కుమార్, గైనిక్ హెచ్ ఓ డి లు సునీత, రాజేశ్వరి పాల్గొన్నారు. 

సంత్ సేవాలాల్ మహరాజ్ జీవితం ఆదర్శం 

బంజారా సమాజానికి సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆదర్శం అని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.  సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవం, మహాభోగ్ భండార్ కార్యక్రమం సోమవారం మెదక్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా  హాజరయ్యారు. బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం శుభ పరిణామమన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్  జీవితం మనందరికీ ఆదర్శ ప్రాయమన్నారు. గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, డీఎస్సీ డివో శశికళ,  గిరిజన సంఘం నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.