వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి :కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి :కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు: వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్​రాహుల్​రాజ్​సూచించారు. గురువారం మెదక్​ కలెక్టరేట్​లో డీఎంహెచ్​వో శ్రీరామ్​ ఆధ్వర్యంలో టాస్క్​ఫోర్స్​ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని, అత్యవసర పనులు ఉంటే మాత్రమే మధ్యాహ్నం బయటకు వెళ్లాలని సూచించారు.

అనంతరం వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీఎం హెచ్​వో శ్రీరామ్​ వివరించారు. జిల్లాలోని ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​నగేశ్​, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో యాదయ్య, వైద్యాధికారులు శివదయాల్​, రవీందర్​కుమార్​, నవీన్​కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు

పాపన్నపేట: వేసవిలో విద్యుత్​సరఫరాలో అంతరాయం ఉండొద్దని కలెక్టర్​రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. పాపన్నపేట మండల పరిధిలోని మిన్​పూర్ సబ్ స్టేషన్ ను ఎస్ఈ శంకర్ తో కలిసి పరిశీలించారు. సంబంధిత రికార్డులను, విద్యుత్ యూనిట్ల వాడకాన్ని చెక్​చేశారు. అనంతరం కుర్తివాడ లో పర్యటించి విద్యుత్ సరఫరా ఎలా జరగుతుందని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.

పదో వార్డులో నీటి సమస్య ఉందని కాలనీవాసులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా మిషన్ భగీరథ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ భాషా, సబ్ డివిజనల్ ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.