
- మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్ టౌన్, వెలుగు : మెదక్జిల్లా వ్యాప్తంగా స్కానింగ్ సెంటర్లపై నిరంతరం నిఘా ఉంచాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు.గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన పీఎన్డీటీ చట్టం అమలుపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లను అధికారుల బృందం తరచూ తనిఖీలు చేయాలన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం మహిళా వైద్యాధికారి అందుబాటులో ఉండేలా జిల్లా అధికారుల చొరవ తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్వో చందూనాయక్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 50 స్కానింగ్ సెంటర్లు ఉండగా అందులో
38 పని చేస్తున్నట్లు తెలిపారు.