
మెదక్ టౌన్, వెలుగు: మెదక్కలెక్టరేట్లో నేడు లాటరీ పద్ధతిలో బార్అండ్ రెస్టారెంట్ కేటాయింపులు చేస్తామని జిల్లా ఎక్సైజ్అండ్ప్రొహిబిషన్సూపరింటెండెంట్శ్రీనివాస్రెడ్డి సోమవారం తెలిపారు. ఇటీవల మూడేళ్లుగా మూతబడిన బార్ అండ్ రెస్టారెంట్లకు రీ నోటిఫికేషన్ ఇవ్వగా 20 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
మంగళవారం అడిషనల్కలెక్టర్నగేశ్ అధ్యక్షతన కేటాయింపులు చేస్తామన్నారు. దరఖాస్తుదారులు అరగంట ముందుగా కలెక్టరేట్‌కు చేరుకోవాలని సూచించారు.