కోనాపూర్​ సొసైటీ నిధులు రికవరీ చేయాలి : ​హఫీజొద్దీన్​

కోనాపూర్​ సొసైటీ నిధులు రికవరీ చేయాలి : ​హఫీజొద్దీన్​

మెదక్​టౌన్, వెలుగు: రామాయంపేట మండలం కోనాపూర్ సొసైటీలో దుర్వినియోగమైన రూ.1.67 కోట్ల నిధులను రికవరీ చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజొద్దీన్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి చైర్మన్​గా ఉన్న సొసైటీలో నిధులు దుర్వినియోగమైనట్లు సహకార శాఖ ఉన్నతాధికారుల విచారణలో తేలిందన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే సొంత గ్రామంలోని సొసైటీలో భారీ ఎత్తున అక్రమాలు జరగడం దారుణమన్నారు. 

రైతుల సంక్షేమానికి కృషి చేయాల్సిన సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు, సీఈవో అక్రమాలకు పాల్పడడం, నిధులు పక్కదారి పట్టించడం విచారకరమన్నారు. దుర్వినియోగం అయిన నిధులను వడ్డీతో సహా రికవరీ చేయడంతో పాటు నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హఫీజొద్దీన్​ డిమాండ్ చేశారు.