
మెదక్, వెలుగు: కాంగ్రెస్ టికెట్ రాలేదన్న ఆవేదనతో ఇటీవల రాజీనామా చేసిన మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. పద్మా దేవేందర్ రెడ్డి గెలుపుకోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.