రాఖీ కడ్దామని వస్తే.. అన్న ఇక లేడని తెలిసింది

రాఖీ కడ్దామని వస్తే.. అన్న ఇక లేడని తెలిసింది

నర్సాపూర్, వెలుగు :  రాఖీ పండుగ వేళ ఒక్కగానొక్క అన్నకు రాఖీ కట్టాలని బయలుదేరి వచ్చిన ఆ చెల్లెళ్లకు అన్న తమకు శాశ్వతంగా దూరమయ్యాడని తెలిసి గుండెలవిసేలా ఏడ్చారు.  మెదక్ జిల్లా ఆవంచ గ్రామానికి చెందిన కొండి జగన్ (45) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడ్తున్నాడు.  గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతతో చనిపోయాడు.

  ఈ విషయం తెలియని చెల్లెళ్లు  నరసమ్మ ,అంబిక అన్నకు రాఖీ కడుతామని  సంతోషంగా పుట్టింటికి వచ్చారు.  కొద్దిసేపటి కిందే అన్న చనిపోయాడని తెలిసి బోరున విలపించారు.