విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి : రాహుల్ రాజ్

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి : రాహుల్ రాజ్
  • కలెక్టర్ రాహుల్ రాజ్ 

రామాయంపేట, వెలుగు: వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే  మెనూలో క్వాలిటీ పాటించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  ఆఫీసర్లకు సూచించారు. బుధవారం రామాయంపేట మున్సిపల్ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ..  సీఎం ఆదేశానుసారం జిల్లా అధికారులు టీంలుగా ఏర్పడి జిల్లాలోని  అన్ని పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో105 రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్ 857 ఉన్నాయని ఆయన తెలిపారు. 

డేటా ఎంట్రీ సజావుగా నిర్వహించాలి

కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు.  బుధవారం రామాయంపేట ఎంపీడీవో కార్యాలయంలోని  ఇంటింటి సర్వే డేటా ఆన్ లైన్ కంప్యూటరీకరణ కేంద్రాన్ని  సందర్శించి, డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. సర్వర్ పనితీరు గురించి సంబంధిత అధికారులని ఆడిగి తెలుసుకున్నారు. 

సమగ్ర సర్వే డేటా ఆన్‌‌‌‌లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలను పాటిస్తూ పారదర్శక డేటా ఎంట్రీ లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 55 వేల కుటుంబాల డేటా ఎంట్రీ  పూర్తయిందని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.