
అధికారులు పట్టించుకోలేదని.. చెరుకు తోటకు నిప్పంటించాడు ఓ రైతు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సదాశివ పల్లి గ్రామానికి చెందిన రైతు తన చెరుకు తోటకు నిప్పంటించాడు. ఆఫీసులో చుట్టూ ఎంత తిరిగినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదనతో.. ఇలా చేశానని రైతు కృష్ణ గౌడ్ తెలిపాడు.
6 సంవత్సరాల క్రితం చెరువు కట్టపై నుంచి పంట పొలానికి దారి( ర్యాంప్) ఏర్పాటు చేసుకోగా.. గ్రామానికి చెందిన కొందరు కక్షపూరితంగా దాన్ని తొలగించారని అధికారులకు కంప్లేంట్ ఇచ్చాడు. తన పట్ట భూమి నుంచే దారిని తొలగించడంతో.. ఆగ్రహంతో ఆ రైతు- ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించాడు. ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని ఆవేదనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు.