- ఇసుక టిప్పర్ రిలీజ్‌కు లంచం డిమాండ్
మెదక్‌టౌన్, వెలుగు : మెదక్ జిల్లా హవేలి ఘనపూర్మండల ఎస్సై కర్రె ఆనంద్‌గౌడ్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. డీఎస్పీ సుదర్శన్కథనం ప్రకారం..మెదక్ లోని కోలిగడ్డ వీధికి చెందిన పూల గంగాధర్‌కు చెందిన ఇసుక టిప్పర్‌ను హవేలి ఘనపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఆ టిప్పర్‌ను రిలీజ్ చేసేందుకు ఎస్సై ఆనంద్రూ.20 వేలు లంచం అడిగాడు. దీంతో గంగాధర్ఏసీబీని ఆశ్రయించాడు.
కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం బస్వాపూర్‌కు చెందిన విలేకరి మహమ్మద్మస్తాన్ కు డబ్బులు ఇవ్వాలని ఎస్సై కోరడంతో హవేలి ఘనపూర్ పీఎస్‌లోనే ఇస్తుండగా ఏసీబీ రైడ్చేసి పట్టుకుంది. మస్తాన్ అసలు విషయం చెప్పడంతో ఎస్సై ఆనంద్‌గౌడ్‌ను కూడా అరెస్ట్‌చేశారు. ఇద్దరినీ హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.