
- ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్‌బోర్డ్
- 30 ఏళ్ల నిరీక్షణకు తెర
మెదక్‌టౌన్, వెలుగు: మెదక్జిల్లాకేంద్రంలో ఇంటర్స్పాట్వ్యాల్యూయేషన్కు ఇంటర్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నిరీక్షణ ఫలించినట్లయింది. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు చొరవతో జిల్లా కేంద్రమైన మెదక్‌పట్టణంలోని జూనియర్ కాలేజీలో స్పాట్ వ్యాల్యూయేషన్ నిర్వహించేందుకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ జిల్లాకేంద్రంలో ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్ 30 ఏండ్ల కలను నెరవేర్చామన్నారు.
త్వరలోనే పదో తరగతి స్పాట్ వ్యాల్యూయేషన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వైద్యరంగంలో కూడా జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గతంలో ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్ కోసం ఇక్కడి లెక్చరర్లు దాదాపు 1,200 మంది సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాకేంద్రాలకు వెళ్లేవారన్నారు. లెక్చరర్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో వ్యాల్యూయేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తూ ఇంటర్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై లెక్చరర్లు హర్షం వ్యక్తం చేశారు.