కరెంట్ షాక్​తో కౌలు రైతు మృతి

రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ శివారులో మంగళవారం కరెంట్ షాక్​తో ఓ కౌలు రైతు చనిపోయాడు. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ తండాకు చెందిన ధరావత్ బుచ్చానాయక్​(47)  ఝాన్సీలింగాపూర్ శివారులో ఉన్న అక్కన్న పేటకు  చెందిన ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో బోరు వద్ద మోటార్ సర్వీస్ వైరు సరి చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు  స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.