గ్రూప్​ 2 లో  మెదక్​ జిల్లా టీచర్​కు స్టేట్​3వ ర్యాంక్

గ్రూప్​ 2 లో  మెదక్​ జిల్లా టీచర్​కు స్టేట్​3వ ర్యాంక్

మెదక్ (కొల్చారం), వెలుగు: గ్రూప్​ 2 ఫలితాల్లో మెదక్​ జిల్లా కొల్చారం మండలం అంసాన్​పల్లి జడ్పీ హైస్కూల్​లో స్కూల్​ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మనోహర్​ రావు​రాష్ట్రంలో 3వ ర్యాంక్​ సాధించాడు.  సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్​ మండలం ఉజలం పాడ్​ కు చెందిన మనోహర్​ రావు 2016లో గ్రూప్​ 2 పరీక్ష రాయగా, 2020లో డిప్యూటీ తహసీల్దార్​గా పోస్టింగ్​ వచ్చింది. 

ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో కొంత కాలం విధులు నిర్వర్తించిన ఆయన ఆ ఉద్యోగం వదిలేసి స్కూల్​ అసిస్టెంట్​ఉద్యోగంలో చేరాడు. 317 జీవోలో ఆయన మెదక్​ జిల్లాకు ట్రాన్స్​ఫర్​ అయి అంసాన్​పల్లి జడ్పీ హైస్కూల్​ లో విధులు నిర్వర్తిస్తున్నారు.