
పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం మంగళవారం కలెక్టర్ రాహుల్రాజ్, ఆర్డీవో రమాదేవి, ఇన్చార్జి తహసీల్దార్మహేందర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్వర్సిటీ నిర్మాణానికి పాపన్నపేట మండలంలోని తమ్మాయిపల్లిలో, పాపన్నపేట గ్రామ పరిధిలో స్థల పరిశీలన చేశామన్నారు. దాదాపు 10నుంచి 15 ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు. అనువైన భూమిని గుర్తించి భూ పరిపాలన విభాగానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.